సహచరులపై సైనికుడు కాల్పులు: ఒకరు మృతి | Soldier shot dead by colleague in malda | Sakshi
Sakshi News home page

సహచరులపై సైనికుడు కాల్పులు: ఒకరు మృతి

Feb 17 2015 10:25 AM | Updated on Oct 22 2018 8:34 PM

పశ్చిమ బెంగాల్ మాల్డాలోని బీఎస్ఎఫ్ సైనిక శిబిరంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది.

కొల్కతా:  పశ్చిమ బెంగాల్ మాల్డాలోని బీఎస్ఎఫ్ సైనిక శిబిరంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. శిబిరంలోని ఓ సైనికుడు తన వద్దనున్న తుపాకీతో సహచరులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఒకరు రక్తపు మడుగులో కుప్పకూలి మరణించాడు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని... విచారిస్తున్నారు. క్షతగాత్రులను మాల్డాలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని  వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement