బెల్టుతో ఉరేసుకున్న రాబిన్ విలియమ్స్ | Robin Williams killed himself by hanging with a belt | Sakshi
Sakshi News home page

బెల్టుతో ఉరేసుకున్న రాబిన్ విలియమ్స్

Aug 13 2014 8:37 AM | Updated on Sep 2 2017 11:50 AM

బెల్టుతో ఉరేసుకున్న రాబిన్ విలియమ్స్

బెల్టుతో ఉరేసుకున్న రాబిన్ విలియమ్స్

రాబిన్ విలియమ్స్ బెల్టుతో ఆయన ఉరేసుకున్నాడని మారిన్ కౌంటీ అధికారి వెల్లడించారు.

లాస్ ఏంజెలెస్: ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత రాబిన్ విలియమ్స్(63) ఆత్మహత్య చేసుకున్నాడని అధికారికంగా నిర్ధారణ అయింది. బెల్టుతో ఆయన ఉరేసుకున్నాడని మారిన్ కౌంటీ అధికారి వెల్లడించారు. ఆత్మహత్యకు ముందు ఆయనేమైనా విషపదార్థాలు సేవించారా, లేదా అనేది పోస్టుమార్టంలో తెలుస్తుందన్నారు. రాబిన్ విలియమ్స్ దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
శ్వాసావరోధం కారణంగానే ఆయన మృతి చెందినట్టు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణయిందని తెలిపారు.

సోమవారం కాలిఫోర్నియాలోని టిబురన్‌లో సొంతిట్లో రాబిన్ విలియమ్స్ ఆకస్మికంగా మృతిచెందారు. నిరాశ, నిస్పృహతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. కాగా, రాబిన్ మరణం పట్ల అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సంతాపం ప్రకటించారు. గొప్ప నటున్ని, స్నేహితున్ని కోల్పోయానని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement