జమ్మూ కాశ్మీర్లో భూకంపం | Moderate intensity earthquake shakes Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

జమ్మూ కాశ్మీర్లో భూకంపం

Nov 16 2013 2:52 PM | Updated on Sep 2 2017 12:40 AM

జమ్మూ కాశ్మీర్ లడక్లోని ఉత్తర లేహ్ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు.

జమ్మూ కాశ్మీర్ లడక్లోని ఉత్తర లేహ్ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున భూమి కంపించిందని  అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 4.0గా నమోదు అయిందని తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున 3.51 గంటలకు ఆ భూమి కంపించిందని చెప్పారు.

 

అయితే భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కాని సంభవించినట్లు తమకు సమాచారం అందలేదని తెలిపారు. భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు విధుల్లోకి పరుగులు తీశారని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement