రణవిద్యలో రెండు గిన్నిస్ రికార్డులు నమోదు | Martial Arts In Two Guinness records | Sakshi
Sakshi News home page

రణవిద్యలో రెండు గిన్నిస్ రికార్డులు నమోదు

Dec 10 2015 4:28 AM | Updated on Oct 20 2018 6:07 PM

రణవిద్యలో రెండు గిన్నిస్ రికార్డులు నమోదు - Sakshi

రణవిద్యలో రెండు గిన్నిస్ రికార్డులు నమోదు

నెల్లూరు కరాటే మాస్టర్ ప్రభాకర్ తనదైన రీతిలో విన్యాసాలను ప్రదర్శించారు. నెల్లూరు మినీబైపాస్‌రోడ్డులోని ఓ ఆడిటోరియంలో...

* నెల్లూరు కరాటే మాస్టర్ ప్రభాకర్ అరుదైన ఫీట్  
* నిమిషంలో బొటన వేళ్లపై 63 పుషప్స్.. 103 క్లాప్స్ పుషప్స్
నెల్లూరు (బృందావనం): నెల్లూరు కరాటే మాస్టర్ ప్రభాకర్ తనదైన రీతిలో విన్యాసాలను ప్రదర్శించారు. నెల్లూరు మినీబైపాస్‌రోడ్డులోని ఓ ఆడిటోరియంలో బుధవారం ఒకే వేదికపై రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు నెలకొల్పారు. ఒక నిమిషంలో రెండు బొటన వేళ్లపై 63 పుషప్స్‌ను తీశారు.

అలాగే పుషప్ప్ విత్ క్లాప్స్‌ను ఒక నిమిషంలో 103 దిగ్విజయంగా ప్రదర్శించారు. ప్రపంచంలో ఇప్పటివరకు రెండు బొటనవేళ్లతో 35 పుషప్స్ గిన్నిస్ రికార్డుగా ఉందని ప్రభాకర్ తెలిపారు. అలాగే పుషప్స్ విత్‌క్లాప్స్ ఇప్పటి వరకు 90 మాత్రమే రికార్డుగా ఉందన్నారు. ఈ రెండు రికార్డులను అధిగమించడం ఎంతో ఆనందంగా ఉందని ప్రభాకర్ తెలిపారు. గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పంపిన నియమ నిబంధనలతో రికార్డు చేసినట్లు వివరించారు.

ఈ ప్రదర్శనను తిలకించేందుకు, రికార్డులు నమోదు చేసేందుకు స్థానిక ప్రాగ్జ్యోతి స్కూల్ కరస్పాండెంట్ లీలాకృష్ణ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఎం.వి.సునీల్‌కుమార్, హరి, ఈఎస్ జగదీష్, కె.గిరికుమార్, ఓ.ప్రేమ్‌కుమార్, సోనాథ్, మల్లికార్జున్ హాజరయ్యారు.

రికార్డుకు సంబంధించి తీసిన వీడియో, ఫొటోగ్రాఫ్‌లను గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులకు పంపనున్నట్లు ప్రభాకర్ తెలిపారు. కాగా వివిధ రణవిద్య ప్రదర్శనలతో ఇప్పటికే నాలుగు గిన్నిస్ రికార్డులను పొందినట్లు ప్రభాకర్ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement