విడిపోయిన భర్తకు నటి బర్త్‌డే విషెస్‌! | Malaika Arora Khan wishes happiness always for Arbaaz Khan on his birthday | Sakshi
Sakshi News home page

విడిపోయిన భర్తకు నటి బర్త్‌డే విషెస్‌!

Aug 4 2016 7:06 PM | Updated on Sep 4 2017 7:50 AM

విడిపోయిన భర్తకు నటి బర్త్‌డే విషెస్‌!

విడిపోయిన భర్తకు నటి బర్త్‌డే విషెస్‌!

ఇన్నాళ్లు వేరువేరుగా ఉంటున్న ఈ జంట మళ్లీ రాజీ కుదుర్చుకొని కలిసిపోయే దిశగా ముందుకుసాగుతున్నట్టు కనిపిస్తోంది.

17 ఏళ్లు ఆనందంగా కొనసాగిన వైవాహిక జీవితం వారిది. కొన్ని నెలల కిందటే వ్యక్తిగత విభేదాలతో విడిపోయారు. ఈ విషయంలో వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ తాము విడిపోయామని బాలీవుడ్‌ దంపతులు ఆర్బాజ్‌ ఖాన్‌, మలైకా ఆరోరా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇన్నాళ్లు వేరువేరుగా ఉంటున్న ఈ జంట మళ్లీ రాజీ కుదుర్చుకొని కలిసిపోయే దిశగా ముందుకుసాగుతున్నట్టు కనిపిస్తోంది. గురువారం (ఆగస్టు 4న) ఆర్బాజ్‌ ఖాన్‌ పుట్టినరోజు కావడంతో మలైకా ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్‌ చెప్పింది. ఆనందం ఎప్పుడూ ఆర్బాజ్‌ వెంటే ఉండాలని కోరుకుంది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఆర్బాజ్‌తో కలిసి తాను కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటోను ఒకదానిని పోస్టు చేసింది.

ఆర్బాజ్‌ ఖాన్‌-మలైకా ఆరోరా దంపతులకు 13 ఏళ్ల కొడుకు ఆర్హాన్‌ ఉన్నాడు. గతంలో వేరయిన ఈ ఇద్దరిని మళ్లీ కలిపేందుకు కుటుంబపరంగా అడుగుల పడుతున్నట్టు తెలుస్తోంది. రంజాన్‌ ఈద్‌ సందర్భంగా ఆర్బాజ్‌ కుటుంబంతో మలైకా గడిపింది. ఈ సందర్భంగా దిగిన ఫ్యామిలీ ఫొటోలోనూ కనిపించింది. తాజాగా ఆర్బాజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపడంతో బీటలువారిన వీరి వైవాహిక బంధం మళ్లీ నిలపుకొనేందుకు దంపతులు ఇద్దరు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నదని సన్నిహితులు చెప్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement