ఇలాంటి అద్భుతాన్ని ఎప్పుడైనా చూశారా? | Incredible photos of PhotoViz | Sakshi
Sakshi News home page

ఇలాంటి అద్భుతాన్ని ఎప్పుడైనా చూశారా?

Nov 22 2016 10:34 AM | Updated on Sep 3 2019 8:44 PM

ఇలాంటి అద్భుతాన్ని ఎప్పుడైనా చూశారా? - Sakshi

ఇలాంటి అద్భుతాన్ని ఎప్పుడైనా చూశారా?

వంద విమానాలు ఒకేసారి, ఒకే విమానాశ్రయం నుంచి, ఒకే రన్‌వేపై నుంచి గాలిలోకి ఎగిరితే ఎలా ఉంటుంది?

ఒక్కొక్కటికాదు షేర్‌ఖాన్‌.. వంద విమానాలు ఒకేసారి, ఒకే విమానాశ్రయం నుంచి, ఒకే రన్‌వేపై నుంచి గాలిలోకి ఎగిరితే ఆ దృశ్యం ఎలా ఉంటుందో తెలుసా? టీమ్‌కి ఐదుగురు ఆడాల్సిన ఆటను వందలమంది కలిసి ఆడితే దాన్ని బాస్కెట్‌ బాల్‌ అనొచ్చా? మంచం మీద పడుకున్న మనిషి.. పొగలాంటి ఆత్మలా మారితే చూసి తట్టుకోగలరా? అనే ప్రశ్నలు సమాధానం తెలియాలంటే నికోలస్‌ గురించి తెలుసుకోవాల్సిందే.

వంద అక్షరాల్లో చెప్పలేనిది ఒక్క ఛాయచిత్రంతో చెప్పేయొచ్చంటారు. కానీ అమెరికాకు చెందిన ఇన్ఫోగ్రాఫిక్‌ జీనియస్‌ నికోలస్‌ ఫెల్టన్‌.. వందలాది ఫొటోలను కలగలిపి ఇదిగో మీరు చూస్తున్న అద్భుతాలను సృష్టిస్తాడు. మూకుమ్మడిగా ఎగురుతున్న విమానాల ఫొటో నిజమైనదే. లాస్‌ ఏంజిల్స్ విమానాశ్రయంలో రకరకాల విమానాలు, వివిధ సమయాల్లో ల్యాండ్‌, టేకాఫ్ అవుతుండగా తీసిన 400 ఫొటోలను గ్రాఫిక్స్ సహాయంతో ఒక్కటి చేసి ఈ ఫోటోను రూపొందించారు.

అంటే పచ్చివాస్తవానికి పక్కా సాంకేతికతను జోడిస్తే ఇలాంటి అద్భుతం తయారవుతుంది అని నికోలస్‌ చెప్పుకొచ్చారు. అలా ఏర్చికూర్చిన ఫొటోల్లో కొన్నింటిని ‘ఫొటోవిజ్‌’పేరుతో పుస్తకంగా మలిచాడు. ‘visualizing information through photography’ ఫొటోవిజ్‌ కు క్యాప్షన్. అన్నట్టు ఈ గ్రాఫిక్‌ జీనియస్ నికోలస్‌ ఫేస్‌బుక్ ప్రాడక్ట్ డిజైనర్ గానూ పనిచేశాడు. ప్రపంచంలోనే టాప్‌-50 గ్రాఫిక్ డిజైనర్లలో ఒకడిగా నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement