'దివాళీలో అలీ, రంజాన్ లో రామ్' | In this country of ours there is a Ali in Diwali and a Ram in Ramzan | Sakshi
Sakshi News home page

'దివాళీలో అలీ, రంజాన్ లో రామ్'

Nov 30 2015 2:24 PM | Updated on Jul 26 2018 8:44 PM

'దివాళీలో అలీ, రంజాన్ లో రామ్' - Sakshi

'దివాళీలో అలీ, రంజాన్ లో రామ్'

బీజేపీ వల్లే దేశంలో మత అసహనం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ఆరోపించారు.

న్యూఢిల్లీ: బీజేపీ వల్లే దేశంలో మత అసహనం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ఆరోపించారు. మత అసహనానికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ సోమవారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చాయ్ పే చర్చ అవసరం లేదని, ఆవుపై చర్చ కావాలన్నారు.

మనదేశంలో జరుపుకొనే పండుగల్లో మత సామరస్యం వెల్లివిరుస్తుందన్నారు. దివాళీలో అలీ, రంజాన్ లో రామ్ పదాలు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోరాదని చెప్పారు. లోక్‌ సభలో మత అసహనంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ ఈ ఆందోళన చేపట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement