అండర్‌వాటర్‌లో హీరోయిన్‌ అమేజింగ్‌ ఫొటోస్‌! | heroine shares a underwater clicks | Sakshi
Sakshi News home page

అండర్‌వాటర్‌లో హీరోయిన్‌ అమేజింగ్‌ ఫొటోస్‌!

Feb 7 2017 8:05 PM | Updated on Jul 26 2018 5:23 PM

అండర్‌వాటర్‌లో హీరోయిన్‌ అమేజింగ్‌ ఫొటోస్‌! - Sakshi

అండర్‌వాటర్‌లో హీరోయిన్‌ అమేజింగ్‌ ఫొటోస్‌!

బాలీవుడ్‌ భామ కత్రినా కైఫ్‌ తాజాగా ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫొటోలు.. అభిమానుల హృదయాలను దోచుకుంటున్నాయి.

బాలీవుడ్‌ భామ కత్రినా కైఫ్‌ తాజాగా ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫొటోలు.. అభిమానుల హృదయాలను దోచుకుంటున్నాయి. తాను నీలిసముద్రపు లోతులో ఉండగా క్లిక్‌మనిపించిన రెండు ఫొటోలను ఆమె తాజాగా ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసుకుంది. అండర్‌వాటర్‌లో ఫ్రెష్‌గా, బ్యూటీఫుల్‌గా కత్రిన అందానికి దివ్యమైన శోభను అద్దుతున్నట్టుగా ఉన్న ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అండర్‌వాటర్‌ ఫొటోలలో ఒక అందమైన పవిత్రత ఉంటుందంటూ ఆమె ఈ ఫొటోలను పోస్ట్‌ చేసింది.

బాయ్‌ఫ్రెండ్‌ రణ్‌బీర్‌ కపూర్‌తో బ్రేకప్‌ అయ్యాక కత్రిన ఈ మధ్య సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ ఫొటోలు, పోస్టులు పెడుతూ అభిమానులను ఆనందపరుస్తోంది. అన్నట్టు.. ఎక్స్‌ లవర్స్‌ అయిన కత్రినా కైఫ్‌-రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన 'జగ్గా జాసుస్‌' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

Advertisement
 
Advertisement
Advertisement