మూకీ చిత్రంగా బజరంగీ భాయ్‌జాన్! | Bhayjan bajarangi as the silent film! | Sakshi
Sakshi News home page

మూకీ చిత్రంగా బజరంగీ భాయ్‌జాన్!

Oct 20 2015 1:58 AM | Updated on Sep 3 2017 11:12 AM

మూకీ చిత్రంగా బజరంగీ భాయ్‌జాన్!

మూకీ చిత్రంగా బజరంగీ భాయ్‌జాన్!

తాజా బ్లాక్ బస్టర్ చిత్రం బజరంగీ భాయ్‌జాన్‌ను మూకీ చిత్రంగా డబ్బింగ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి

ఇండోర్: తాజా బ్లాక్ బస్టర్ చిత్రం బజరంగీ భాయ్‌జాన్‌ను మూకీ చిత్రంగా డబ్బింగ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌లో తప్పిపోయిన భారత్‌కు చెందిన మూగ-చెవిటి యువతి గీత కోరిక మేరకు సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రాన్ని సైగలతో రూపొందిచనున్నారు. భారత్‌లో తప్పిపోయిన ఓ పాకిస్తానీ చిన్నారిని ఆమె తల్లి దగ్గరకు చేర్చే వృత్తాంతంతో బజరంగీ భాయ్‌జాన్ సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తన జీవితానికి దగ్గరగా ఉందని.. ఈ చిత్రాన్ని మూగ భాషలో డబ్బింగ్ చేస్తే.. తనలాంటి చాలా మంది చూసి ఆనందిస్తాని గీత కోరినట్లు ఇండోర్‌లోని మూగ పిల్లల సహాయ కేంద్రం సంరక్షకుడు జ్ఞానేంద్ర పురోహిత్ తెలిపారు. ఆమె కోరిక మేరకు తమ సంస్థే డబ్బింగ్ పనులు చూస్తుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement