'బాహుబలి-2' ట్రైలర్‌ ఎప్పుడంటే...! | Baahubali 2 theatrical trailer will release in January 2017 | Sakshi
Sakshi News home page

'బాహుబలి-2' ట్రైలర్‌ ఎప్పుడంటే...!

Aug 6 2016 6:08 PM | Updated on Sep 4 2017 8:09 AM

'బాహుబలి-2' ట్రైలర్‌ ఎప్పుడంటే...!

'బాహుబలి-2' ట్రైలర్‌ ఎప్పుడంటే...!

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పకుండా ట్విస్టు ఇచ్చాడు రాజమౌళి.

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పకుండా ట్విస్టు ఇచ్చాడు రాజమౌళి. ఆ ట్విస్టు ఏమిటో తెలుసుకోవాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 28 వరకు వేచిచూడాల్సిందే. 'బాహుబలి-2'  హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'బాహుబలి-2' థియెట్రికల్‌ ట్రైలర్‌ జనవరిలో విడుదలయ్యే అవకాశముందని దగ్గుబాటి రాణా తెలిపాడు.  

ప్రస్తుతం 'బాహుబలి-2' షూటింగ్‌లో బిజీగా ఉన్న రాణా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ 'మేం వేగంగా సినిమా పనులను పూర్తిచేస్తున్నాం. కొద్ది రోజుల్లో ఇవి పూర్తికానున్నాయి. ఈ ఏడాది చివర్లో లేదా జనవరిలో ఫస్ట్‌ ప్రోమో విడుదలయ్యే అవకాశముంది. ఇది టీజర్‌ లేక థియెట్రికల్‌ ట్రైలరా అన్నది నాకు తెలియదు. కానీ కచ్చితంగా జనవరిలో ఇది విడుదల కానుంది' అని 'భల్లాలదేవ' రాణా తెలిపాడు.

ప్రపంచవ్యాప్తంగా ప్రశంలందుకున్న 'బాహుబలి' పార్ట్‌-1ను మించేస్థాయిలో పార్‌-2ను తీర్చిదిద్దేందుకు దర్శకుడు రాజమౌళి బృందం శ్రమిస్తోంది. కేవలం క్లైమాక్స్‌ కోసమే రూ. 30 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. 'ఎక్స్‌ మెన్‌', '300' వంటి హాలీవుడ్‌ సినిమాలకు పనిచేసిన ఆర్టిస్టులు క్లైమాక్స్‌ కోసం రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement