వీడు మనిషేనా.. | A sadist husband | Sakshi
Sakshi News home page

వీడు మనిషేనా..

Mar 14 2017 2:25 AM | Updated on Jul 28 2018 8:53 PM

వీడు మనిషేనా.. - Sakshi

వీడు మనిషేనా..

కట్టుకున్నవాడు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి భార్యను బజారుపాలు చేశాడు.

భార్య నగ్న చిత్రాలు వాట్సాప్‌లో షేరింగ్‌
స్నేహితుడితో అత్యాచారం చేయించి దుర్మార్గం
పాతబస్తీలో ఘటన...  భర్త, అత్త అరెస్టు


హైదరాబాద్‌: కట్టుకున్నవాడు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి భార్యను బజారుపాలు చేశాడు. సభ్యసమాజం సిగ్గుపడేలా... ఆమె నగ్న చిత్రాలు చిత్రీకరించి ఆ వీడియోలను స్నేహితులకు షేర్‌ చేశాడు. అప్పటికీ అతడిలోని పైశాచికం చల్లారక భార్యకు మత్తు మందిచ్చి... వేరొకరితో అత్యాచారం చేయించాడు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యశిస్తున్నా... విలువలు వదిలిన కన్న కొడుకును మందలించాల్సిన తల్లి, సోదరి అతడికి వంతపాడారు. చెప్పుకొనే దిక్కు లేక... ఆ అభాగ్యురాలు చివరకు పోలీసుల్ని ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు భర్త, అత్తలను సోమవారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ కీచక పర్వం వివరాలను దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణ వెల్లడించారు.

వీడియో కాలింగ్‌ దృశ్యాలు రికార్డు చేసి...
పాతబస్తీ హఫీజ్‌ బాబానగర్‌కు చెందిన సనా ఫాతిమా (26), మాదన్నపేట సాలార్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ సలీముద్దీన్‌ (28)లకు గతేడాది ఏప్రిల్‌లో వివాహమైంది. ఎంటెక్‌ చదివేందుకు సలీముదీన్‌ ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడే పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. పాశ్చాత్య పోకడలకు అలవాటుపడ్డ సలీముద్దీన్‌ తరచూ మాదన్నపేటలో ఉంటున్న భార్యకు వీడియోకాలింగ్‌ చేసేవాడు. తనతో నగ్నంగా మాట్లాడాలని ఒత్తిడి తెచ్చేవాడు. ఈ వీడియో కాల్స్‌ను రికార్డు చేసిన సలీముద్దీన్‌... వాటిని వాట్సాప్‌ ద్వారా స్నేహితులకు షేర్‌ చేశాడు.

కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి...
సనా ఉండే ఇంట్లోనే కింది భాగంలో ఆమె అత్త నూర్జహాబేగం నివసిస్తోంది. సలీముద్దీన్‌ స్నేహితుడైన వట్టేపల్లివాసి చాంద్‌ తరచూ నూర్జహా ఇంటికి వచ్చిపోతుంటాడు. అతడు సనాతో అభ్యంతరకరంగా ప్రవర్తించేవాడు. ఇది తెలిసినా పట్టించుకోని నూర్జహా... చాంద్‌ను ప్రొత్సహిస్తూ వచ్చింది. గత నెలలో ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిన సలీముద్దీన్‌... తన సెల్‌ఫోన్‌లో ఉన్న భార్య ‘దృశ్యాలను’చాంద్‌కు చూపించాడు. అదే సందర్భంలో ఆమెపై మోజు ఉన్న విషయాన్ని చాంద్‌ చెప్పాడు. మందలించాల్సిన సలీముద్దీన్‌... తన భార్యపై అత్యాచారానికి సహకరిస్తానంటూ ప్రోత్సహించాడు. ఈ నెల 4న సనాకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చిన సలీముద్దీన్‌... ఆమె మత్తులోకి జారుకోగానే చాంద్‌ను పిలిచి అత్యాచారం చేయించాడు.

మంచి పిల్లలు పుడతారంటూ...
హఫీజ్‌బాబానగర్‌లోని ఓ దర్గాలో ఉండే బాబా అంటే సలీముద్దీన్‌కు అమితమైన భక్తి. స్వదేశానికి ఎప్పుడు వచ్చినా మొదటగా ఆ బాబా దర్శనం చేసుకున్నాకే ఇంటికి వెళతాడు. సదరు బాబాతో కూడా శారీరక సంబంధం పెట్టుకోవాలని, అప్పుడే తమకు మంచి పిల్లలు పుడతారంటూ భార్యపై సలీం ఒత్తిడి చేసేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సదరు బాబాను సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తామన్నారు.

చెప్పినా పట్టించుకోని అత్తా, ఆడపడచు...
జరిగిన ఘోరాన్ని సనా తన అత్త, ఆడపడుచులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. పైగా... ఉన్నత కుటుంబాల్లో ఇవన్నీ సహజమేనని, సర్దుకుపోవాలని సలహా ఇచ్చారు. దీంతో దిక్కుతోచని బాధితురాలు శనివారం కంచన్‌బాగ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం భర్త సలీముద్దీన్, అత్త నూర్జహాను అరెస్టు చేశారు. సలీముద్దీన్‌ మంగళవారం ఆస్ట్రేలియా తిరిగి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నాడు. పరారీలో ఉన్న చాంద్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement