అమెరికాలో గని ప్రమాదం.. ఇద్దరి మృతి | 2 killed, 20 injured in US mining accident | Sakshi
Sakshi News home page

అమెరికాలో గని ప్రమాదం.. ఇద్దరి మృతి

Nov 18 2013 11:51 AM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో జరిగిన గని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించగా, 20 మంది గాయపడ్డారు.

అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో జరిగిన గని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించగా, 20 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగే సమయానికి కార్మికులంతా భూగర్భంలో ఉన్నట్లు ఔరే కౌంటీ ప్రతినిధి మార్టి విట్మోర్ తెలిపారు. ఇప్పటివరకు ఈ ప్రమాదం విషయంలో వస్తున్నవన్నీ ఊహాగానాలే తప్ప ప్రమాదం ఎలా జరిగింది, దానికి కారణం ఏంటన్నది ఇంతవరకు తెలియలేదన్నారు.

మొత్తం కార్మికులంతా ఆ సమయానికి ప్రమాదస్థలంలోనే ఉన్నారని యాజమాన్యం చెప్పిందన్నారు. క్షతగాత్రులలో 20 మందిని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఇద్దరు తప్ప అందరికీ చికిత్సలు చేసి ఇళ్లకు పంపేసినట్లు ఆమె చెప్పారు. ఏదో పొగ రావడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోందని స్టార్ మైన్ ఆపరేషన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ రోరీ విలియమ్స్ తెలిపారు. పొగలో రసాయనాలు కూడా ఉండటం వల్ల కార్మికులు గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement