ఎవరో.. ఎక్కడి నుంచి వచ్చిందో.. | Who came from now here | Sakshi
Sakshi News home page

ఎవరో.. ఎక్కడి నుంచి వచ్చిందో..

Apr 11 2016 1:30 AM | Updated on Sep 3 2017 9:38 PM

పాపం ఈ మహిళా... దారి తప్పింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో. కానీ హసన్‌పర్తిలో తిరుగుతోంది. గుంటూరు జిల్లా అని, భర్త పిల్లల పేర్లు చెబుతున్నా. .

హసన్‌పర్తి : పాపం  ఈ మహిళా... దారి తప్పింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో. కానీ హసన్‌పర్తిలో తిరుగుతోంది. గుంటూరు జిల్లా అని, భర్త పిల్లల పేర్లు చెబుతున్నా.. తన పేరు చెప్పలేనట్లుగా మతిస్థిమితం కోల్పోరుు ఉంది. దొరికింది తింటూ పొట్ట నింపుకుంటోంది. స్థానిక హోటల్ వారు టిఫిన్ అందిస్తున్నారు. అలాగే పండ్ల వ్యాపారులు పండ్లు ఇస్తూ తమ మానవత్వాన్ని చూపిస్తున్నారు. ఆమెను చూసి చలించిన పండ్ల వ్యాపారి బల్సుకూరి వనక్క ఆ మహిళకు కట్టింగ్ చేరుుంచి తన వద్ద ఉన్న చీరెను అందించింది. పలుమార్లు వివరాల తెలుకునేందుకు పండ్ల వ్యాపారి ప్రయత్నించింది.


చివరికి భర్త పేరు డి.సమ్మయ్య, చంద్రశేఖర్(కొడుకు), జ్యోత్స్న(కూతురు), భాస్కర్(మామ), నిర్మల(అత్త)గా తెలిపింది. తాను గుంటూరు జిల్లాకు చెందినదానినని సదరు మహిళ చెబుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఆచూకి తెలిసిన వారు సదరు మహిళను ఆమె కుటుంబసభ్యుల వద్దకు చేర్పించాలని, ఆకతారుుల నుంచి రక్షించేందుకు ఆమెకు ఆశ్రయం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement