స్కూల్‌ బ్యాగ్‌లో రక్తపింజర! | Viper serpent in school bag | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బ్యాగ్‌లో రక్తపింజర!

Aug 2 2017 2:55 AM | Updated on Sep 15 2018 5:32 PM

స్కూల్‌ బ్యాగ్‌లో రక్తపింజర! - Sakshi

స్కూల్‌ బ్యాగ్‌లో రక్తపింజర!

ఓ విద్యార్థిని తెచ్చుకున్న పుస్తకాల సంచిలో రక్తపింజర పాము దాగివున్న సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం

కేసముద్రం: ఓ విద్యార్థిని తెచ్చుకున్న పుస్తకాల సంచిలో రక్తపింజర పాము దాగివున్న సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలంలోని కోమటిపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. కోమటిపల్లి శివారు చంద్రుతండాకు చెందిన ఐదో తరగతి విద్యార్థిని అజ్మీరా అఖిల కోమటిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతోంది.

బ్యాగ్‌లో నుంచి పుస్తకం తీయడానికి చేయిపెట్టింది. చేతికి మెత్తగా తాకినట్లుగా అనిపించడంతో బ్యాగ్‌ను పూర్తిగా తెరిచేసరికి లోపల పాము కనిపించింది. ఆమె ఒక్కసారిగా అరుస్తూ క్లాస్‌ టీచర్‌ క్రిష్ణయ్య వద్దకు పరుగెత్తింది.  ఆ క్లాస్‌టీచర్, హెచ్‌ఎం సోమిరెడ్డి కలసి క్లాసులో ఉన్న పిల్లలందరినీ బయటకు పంపించారు. వెంటనే దాన్ని కర్రతో కొట్టి చంపేయడంతో ప్రమాదం తప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement