ఇంటినే ‘ఎత్తు'తున్నారు..! | Sakshi
Sakshi News home page

ఇంటినే ‘ఎత్తు'తున్నారు..!

Published Sat, Aug 1 2015 4:03 AM

ఇంటినే ‘ఎత్తు'తున్నారు..!

జిల్లాలో తొలిసారి మూడడుగులు పైకి..
 
 చండ్రుగొండ : పూర్వీకులు కట్టిన ఇల్లా.. భూమిలోకి కుంగిపోరుుందా.. వర్షం వస్తే నీరు ఇంట్లోకి వస్తుదా.. అరుుతే ఫర్వాలేదు ఇంటినే పైకి ఎత్తుతామంటున్నారు హర్యానాకు చెందిన ఇంజినీరింగ్  నిపుణులు ! వివరాలు ఇలా ఉన్నారుు. ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లి గ్రామంలో వేముల నగేష్ అనే వ్యాపారి తన ఇల్లు తల్లిదండ్రుల కష్టార్జితం. ఇంటి ముందు రోడ్డు పెరగడంతో.. వర్షం వస్తే నీరు ఇంట్లోకి వస్తోంది. ఈ క్రమంలో నెట్‌లో డోంట్ వర్రీ, అప్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ బిల్డింగ్స్ అనే ప్రకటనను చూశాడు. వెంటనే ఫోన్‌లో హర్యాన రాష్ట్రంలోని యముననగర్‌కు చెందిన బీఎల్‌ఆర్ ఇంజినీరింగ్ గ్రూప్, మామ్‌చంద్ అండ్ సన్స్ వారిని సంప్రదించాడు. అంతే వారు వచ్చి ఇల్లు చూసుకున్నారు. మూడు అడుగుల ఎత్తు పైకిలేపేందుకు రూ. 3 లక్షలు మొత్తాన్ని ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. గురువారం పనులు ప్రారంభించారు. శుక్రవారం ఇంటిని పైకి ఎత్తే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

 జాకీ సిస్టంతో..
 ఇంటి చుట్టూ, మధ్య భాగంలోని గోడలన్నింటికి సుమారు 200 జాకీలు అమర్చారు. మేనేజర్ గురుమాన్‌సింగ్ పర్యవేక్షణలో పది మంది కుర్రాళ్ళు జాకీలను ఒకదాని తరువాత మరోదాన్ని ఎత్తుకుంటూ పోతున్నారు. ఒక్కరోజులోనే వ్యాపారి నగేష్ నాలుగు గదుల ఇల్లు ఆరంగుళాలు పైకి లేచింది. 25 నుండి 40 రోజుల్లో ఇల్లంతా మూడడుగులు ఎత్తు ఎత్తే విధంగా వారు ప్రణాళిక చేసుకున్నారు. ఖాళీ అవుతున్న ప్రదేశంలో కాంక్రీట్ నింపి ఇంటి కింది భాగంలోని బేస్‌మెంట్‌ను బలోపేతం చేస్తామని  గురుమాన్‌సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. రెండురోజులుగా సాగుతున్న ఈ ప్రక్రియ మండలంలో చర్చనీయంశం కావడంతో జనం తండోపతండాలుగా అన్నపురెడ్డిపల్లి వెళ్ళి వీక్షిస్తున్నారు.
 
 మా అమ్మనాన్న కట్టిన ఇల్లు

 నలభై ఏళ్ళ క్రితం మా నాన్నగారు కట్టిన ఇల్లు. ఈ ఇంట్లో మా అమ్మనాన్నల కష్టార్జితం ఉంది. అయితే ఇంటి ముందు సీసీరోడ్డు నిర్మాణం చేశారు. దీంతో రోడ్డు ఎత్తులో ఉండగా మా ఇల్లు కిందికి అయిపోయింది. దీనికితోడు వర్షం వస్తే గోడలు నిమ్ము వస్తుంది. ఫలితంగా మా కుటుంబం ఇబ్బంది పడ్తుంది.. ఖర్చు ఎంతైనా సరే మా అమ్మనాన్నలు కట్టిన ఇల్లు కూల్చ వద్దనే లిఫ్ట్ సిస్టం ద్వార మా ఇల్లు ఎత్తు పెంచుతున్నాను.  
 వేములు నగేష్, ఇంటి యజమాని, అన్నపురెడ్డిపల్లి.

 పదేళ్లుగా చేస్తున్నాం
 బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ సిస్టంలో దేశంలోనే మాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇల్లు ఎంతపైకి ఎత్తినా వెంట్రుకవాసి కూడా పగుళ్ళు రాదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో మేం విజయవంతంగా పనిచేశాం. తెలంగాణరాష్ట్రంలో మాత్రం ఇదే మొదటిసారి. పదేళ్ళ క్రితం ఈ విధానాన్ని మా కంపెనీ ప్రవేశపెట్టింది. మా పనితీరుకు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కోసం ప్రయత్నం చేస్తున్నాం.
 గురుమాన్‌సింగ్, మేనేజర్,  బీఎల్‌ఆర్ ఇంజినీరింగ్ గ్రూప్, మామ్‌చంద్ అండ్ సన్స్,యముననగర్, హర్యాన

Advertisement
Advertisement