దాహం తీరింది..  | The thirst is over | Sakshi
Sakshi News home page

దాహం తీరింది.. 

Apr 4 2018 11:08 AM | Updated on Apr 4 2018 11:08 AM

The thirst is over - Sakshi

నిర్మల్‌అర్బన్‌: ఎండలు మండుతున్నాయి. వేసవి దాహార్తికి పశు, పక్ష్యాదులు విలవిల్లాడుతున్నాయి. అందుకు ఈ చిత్రాలే నిదర్శనం. జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లో ఓ ఆవు దాహార్తితో మసీద్‌ వద్ద ఉన్న నల్లా వద్దకు చేరింది. నల్లా నుంచి నీరు రాకపోవడంతో అటూ.. ఇటూ దీనంగా చూసింది. ఫోన్‌లో మాట్లాడుతూనే ఆవును గమనించిన మొజాన్‌ అనే వ్యక్తి అక్కడికి చేరుకుని నల్లాను తెరిచాడు. ఒక్కసారిగా నల్లా నుంచి నీరు రావడంతో నీటిని తాగిన ఆవు తన దాహార్తిని తీర్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement