సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో కొత్త సీరిస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. పక్షం రోజుల తరువాత రిజిస్ట్రేషన్లు మొదలు కావడంతో వాహనదారుల్లో ఆనందం వ్యక్తమైంది. మొన్నటి వరకు వాహనాల సిరీస్, కోడ్ విషయంలో స్పష్టత లేకపోవడంతో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారికి నిరీక్షణ తప్పలేదు. కొత్త సిరీస్ రిజిస్ట్రేషన్లకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాహనదారులు ఉత్సాహంగా ఆర్టీఏ కార్యాలయాలకు చేరుకున్నారు. మొదటి రోజైన బుధవారం గ్రేటర్ పరిధిలో 967 కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. విరామం తరువాత రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావడంతో నగరంలోని ఖైరతాబాద్‌తోపాటు ఉప్పల్, అత్తాపూర్, మేడ్చెల్, సికింద్రాబాద్, మెహదీపట్నం తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనదారుల రద్దీ కనిపించింది.
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మొట్టమొదటి నెంబర్ ‘టీఎస్ 09 ఈఏ 0002’ను నగరంలోని రహమత్‌నగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేడపాటి శివారెడ్డి తన స్విఫ్ట్‌డిజైర్ కోసం సొంతం చేసుకున్నారు. మరో నెంబర్ ‘టీఎస్ 09 ఈఏ 0003’ వేదాంత లైఫ్‌సెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. ‘టీఎస్ 09 ఈఏ 0004’ నెంబర్‌ను ఎన్.సుధాకర్ అనే వ్యక్తి తన హోండా యాక్టీవాకు తీసుకున్నారు. కొత్త సిరీస్ ప్రారంభమైనప్పటికీ వాహనదారుల్లో సరైన అవగాహన లేక ఫ్యాన్సీ నెంబర్లకు డిమాండ్ కనిపించలేదు. సాధారణ ఫీజులు, తత్కాల్ ఫీజులపైనే వాహనదారులు తమకు కావలసిన నెంబర్లను దక్కించుకున్నారు. ‘టీఎస్09 ఈఏ 369’ కోసం ఓ వాహనదారుడు రూ.70 వేలు వేలం ద్వారా చెల్లించగా ‘టీఎస్ 09 ఈఏ 18’ కోసం మరో వాహనదారుడు రూ.10 వేలు చెల్లించారు.
ఫ్యాన్సీ నెంబర్లు సర్కార్‌కే..
తెలంగాణ రాష్ర్టంలోని తొలి సిరీస్‌లో ఫ్యాన్సీ నెంబర్లను ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంది. ప్రభుత్వ వాహనాల కోసం వీటిని వినియోగించనున్నట్టు రవాణా అధికారులు తెలిపారు. వాహనదారులు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ‘1, 11, 111, 6, 66, 666, 9, 99, 999’ వంటి నెంబర్లు సర్కార్ వాహనాలకే సొంతం కానున్నాయి. మొట్టమొదటి సిరీస్ కావడంతో ప్రభుత్వం ఈ నెంబర్లకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది.
పాత వాహనాలపై ప్రతిష్టంభన..
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనా పాత వాహనాలపై నెలకొన్న ప్రతిష్టంభన మాత్రం తొలగిపోలేదు. ‘ఏపీ’ నుంచి ‘టీఎస్’కు మారిన దృష్ట్యా అన్ని వాహనాలు తప్పనిసరిగా ఇందుకు అనుగుణంగా నెంబర్ ప్లేట్‌లను సవ రించుకోవాల్సి ఉంటుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో జిల్లా కోడ్ నెంబర్లు కూడా మారిపోతాయి. ఈ అంశంపై స్పష్టతకు మరో వారం, పది రోజులు పట్టవచ్చని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ ర ఘునాథ్ ‘సాక్షి’తో చెప్పారు. ‘టీఎస్‌తో రిజిస్ట్రేషన్ అయ్యే కొత్త వాహనాలకు మాత్రం ఎప్పటికప్పుడు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తీసుకునే విధంగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
రంగారెడ్డి పరిధిలో 482 రిజిస్ట్రేషన్లు
అత్తాపూర్: రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ ఆర్టీఏ కార్యాలయాల్లో బుధవారం 482 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సి.రమేశ్ తెలిపారు. అత్తాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో 116, ఇబ్రహీంపట్నంలో 174, ఉప్పల్‌లో 93, మేడ్చల్‌లో 99 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్టు చెప్పారు.
ఉప్పల్‌లో టీఎస్ 08 సిరీస్..
ఉప్పల్: రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాహనదారులతో ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయం కిక్కిరిసిపోయింది. టీఎస్ 08 ఈఏ 0001, ట్రాన్స్‌పోర్టు వాహనాల సిరీస్ టీఎస్ 08 యూఏ 0001తో ప్రారంభమయ్యాయి. ఉప్పల్ పారిశ్రామికవాడకు చెందిన దోషి జమ్స్ అండ్ జ్యువెలర్స్ పేరిట ‘టీఎస్ 08 ఈఏ 0001’ నెంబర్‌ను రూ. 50 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందాడు.
ప్రారంభమైన టీఎస్ సిరీస్
Published Thu, Jun 19 2014 12:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement