‘మహానాడు’ ఏర్పాట్లు చకచకా.. | Seniors Force Naidu to Defer Son's Promotion at Mahanadu | Sakshi
Sakshi News home page

‘మహానాడు’ ఏర్పాట్లు చకచకా..

May 25 2015 11:27 PM | Updated on Oct 8 2018 5:28 PM

‘మహానాడు’ ఏర్పాట్లు చకచకా.. - Sakshi

‘మహానాడు’ ఏర్పాట్లు చకచకా..

మండలంలోని హిమాయత్‌నగర్, గండిపేట ఎన్‌టీఆర్ కుటీరంలో రేపు జరుగనున్న మహానాడుకు టీడీపీ ఏర్పాట్లు వేగంవం తం చేసింది.

మొయినాబాద్ రూరల్: మండలంలోని హిమాయత్‌నగర్, గండిపేట ఎన్‌టీఆర్ కుటీరంలో రేపు జరుగనున్న మహానాడుకు టీడీపీ ఏర్పాట్లు వేగంవం తం చేసింది. సోమవారం నాడు ఏపీ సీఎం సెక్యూరిటీ అధికారి సత్యనారాయణ, సైబారాబాద్ సె క్యూరిటీ వింగ్ అధికారి నారాయణ, ఏపీ డీజీపీ జే వీ.రాముడు, ఆడిషనల్ డీజీపీ అనురాధ, సైబరాబాద్ ట్రాపిక్ డీజీపీ అవినాష్ మహంతి, ట్రాఫిక్ డీజీపీ శ్రీనివాస్‌రావు తదితర అధికారులు మహానా డు నిర్వహించే ప్రాంతాలను క్షుణంగా పరిశీలించారు. వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా పూర్తిస్థాయిలో బందోబస్తు నిర్వహిం చాలన్నారు. ప్రతి ఒక్కరికీ గుర్తింపుకార్డు ఉంటేనే అనుమతించాలన్నారు.

వీరి వెంట ఎస్‌బీ ఇన్స్‌పెక్టర్ లక్ష్మీనారాయణ, రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, తహసీల్దార్ గంగాధర్, మొయినాబాద్ సీఐ రవిచంద్ర, ఎస్‌ఐ సంజీవ్‌కుమార్, అంతిరెడ్డి, సి బ్బంది ఉన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రశాశ్‌గౌడ్, మహిళా అద్యక్షురాలు తులసి మాట్లాడుతూ మహానాడును ఘనంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. సోమవారం సాయంత్రం వసభావేదిక, ఫొటో గ్యాలరీ, భోజన వసతుల ఏర్పాట్లను, తాగునీటి తదితర వసతులు పరిశీలించారు. టీడీపీ నాయకులు  వెంకట్‌రెడ్డి, పెంటారెడ్డి, నన్నపనేని రాజకుమారి, మాధవి, సత్యవాణి, అంజలి, పద్మావతి, సుప్రియ, తులసి, కళావతి, స్వప్న, విజయలక్ష్మి, శేఖర్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement