రాజీనామా చేసిన వీకే సింగ్‌ | Senior IPS VK Singh Resigns To His Post | Sakshi
Sakshi News home page

రాజీనామా చేసిన వీకే సింగ్‌

Jun 24 2020 9:21 PM | Updated on Jun 24 2020 9:48 PM

Senior IPS VK Singh Resigns To His Post - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వినోయ్‌కుమార్‌ సింగ్‌ (వీకేసింగ్‌) తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఆయన బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా వీకే సింగ్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. తన రాజీనామాను కేంద్ర హోం శాఖ మంత్రికి పంపించారు. కాగా, కొద్ది రోజుల క్రితమే తన రాజీనామా గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని అర్హతలున్న తనకు డీజీపీగా పదోన్నతి కల్పించాలని, అలాకాని పక్షంలో తాను రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ ప్రభుత్వానికి లేఖ ద్వారా విన్నవించారు.

మరోవైపు ఈ ఏడాది నవంబర్‌ 30న వీకే సింగ్‌ సర్వీసు ముగియనుంది. అయితే తనకు అక్టోబర్‌ 2 ప్రీ రిటైర్‌మెంట్‌ ఇవ్వాలని ఆయన తన లేఖలో కోరారు. జైళ్లశాఖ డీజీగా పనిచేసిన ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement