రేవ్ పార్టీ: యువతీ యువకుల అరెస్ట్ | Rave party busted in Moinabad, 40 arrested for 'obscene' dancing | Sakshi
Sakshi News home page

రేవ్ పార్టీ: యువతీ యువకుల అరెస్ట్

Dec 20 2014 8:00 AM | Updated on Mar 28 2018 11:11 AM

ఫైల్ ఫొటో - Sakshi

ఫైల్ ఫొటో

మరో రేవ్ పార్టీని పోలీసులు పోలీసులు భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఓ ఫామ్హౌస్పై పోలీసులు దాడి చేసి సుమారు 40మందిని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ :  మరో రేవ్ పార్టీని పోలీసులు పోలీసులు భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని  ఓ ఫామ్హౌస్పై పోలీసులు దాడి చేసి సుమారు 40మందిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో పదిమంది యువతులతో పాటు, 30మంది ఇంజినీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున మద్యంతో పాటు హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా ఈనెల 7వ తేదీన కూడా .ఓ ఫాంహౌస్ లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న రేవ్ పార్టీపై  సైబారాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. అర్థనగ్నంగా డాన్సులు చేస్తున్న 8 మంది ముంబై మోడల్స్, 22 మంది యువకులను అరెస్ట్ చేశారు. మరోవైపు రేవ్ పార్టీలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రేవ్ పార్టీలు జోరందుకుంటున్నాయి.  విలాసాలకు అలవాటుపడిన యువత రేవ్ పార్టీల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మత్తులో జోగుతూ అనైతిక కార్యకలాపాలు సాగిస్తున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement