‘కోడ్’ కూసినా .. | ration dealer sale the photos of former kirankumar reddy | Sakshi
Sakshi News home page

‘కోడ్’ కూసినా ..

Mar 17 2014 1:53 AM | Updated on Jul 29 2019 5:31 PM

‘కోడ్’ కూసినా .. - Sakshi

‘కోడ్’ కూసినా ..

దోమకొండ మండలంలోని తుజాల్‌పూర్ లో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి , మాజీ మంత్రి శ్రీధర్‌బాబులతో కూడిన బొమ్మలు ఉన్న పంచదార, గోధుమ ప్యాకెట్లను రేషన్‌డీలర్ విక్రయిస్తున్నారని ఆదివారం గ్రామస్తులు కొందరు తహశీల్దార్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు.

దోమకొండ, న్యూస్‌లైన్ : దోమకొండ మండలంలోని తుజాల్‌పూర్ లో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి , మాజీ మంత్రి శ్రీధర్‌బాబులతో కూడిన బొమ్మలు ఉన్న పంచదార, గోధుమ ప్యాకెట్లను రేషన్‌డీలర్ విక్రయిస్తున్నారని ఆదివారం గ్రామస్తులు కొందరు తహశీల్దార్‌కు  ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో తహశీల్దార్ బాలయ్యతో పాటు వీఆర్వో ముత్తన్న గ్రామానికి చేరుకుని వాటిని పరిశీలించారు.
 
  మండలంలో మొత్తం 37 రేషన్‌షాపులకు గాను 5 షాపుల్లో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్న బొమ్మల ప్యాకెట్లు వచ్చాయని తహశీల్దార్ తెలిపారు.  పాత స్టాక్ రేషన్‌డీలర్‌లకు రాగా, ప్యాకెట్‌లపై ఉన్న మాజీ సీఎం ఫొటో కనబడకుండా వాటిపై ప్యాకెట్‌లు కప్పి లబ్ధిదారులకు అందించారని తెలి పారు. దీనిపై జిల్లా అధికారులకు వివరించినట్లు తహశీల్దార్ బాలయ్య చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement