సినీ నిర్మాత కల్యాణ్‌కు నోటీసులు | Notice to film producer Kalyan | Sakshi
Sakshi News home page

సినీ నిర్మాత కల్యాణ్‌కు నోటీసులు

May 6 2015 11:39 PM | Updated on Mar 28 2018 11:08 AM

వైద్యురాలిపై దాడి కేసులో సినీ నిర్మాత చిల్లర కల్యాణ్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

బంజారాహిల్స్ : వైద్యురాలిపై దాడి కేసులో సినీ నిర్మాత చిల్లర కల్యాణ్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.5లో ఆయన నివసించే అపార్ట్‌మెంట్‌లోనే ఉంటున్న డాక్టర్ టి.కవిత  గతనెల 26న నిర్మాత క ల్యాణ్ తనపై దాడి చేసి చంపేస్తానని బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  కల్యాణ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి ఆయన కోసం గాలిస్తున్నారు. 

ఎటకేలకు అతడి  ఆచూకీ తెలుసుకొని బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పోలీసు స్టేషన్‌కు రప్పించా రు. సుమారు రెండు గంటల పాటు కల్యాణ్‌ను విచారించారు. ఆ రోజు జరిగిన ఘటనను తెలుసుకొని ఆయనపై నమోదై ఉన్న కేసు వివరాలను వెల్లడించారు. మీపై వచ్చిన అభియోగాలకు సమాధానం ఇవ్వాలని, ఎందుకు అరెస్టు చేయకూడదో మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసులు అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement