'ప్రతి ఇంటికి గ్యాస్ స్టవ్‌లు అందిస్తాం' | Minister Jogu Ramanna visits Jaipur | Sakshi
Sakshi News home page

'ప్రతి ఇంటికి గ్యాస్ స్టవ్‌లు అందిస్తాం'

Feb 22 2016 3:35 PM | Updated on Sep 3 2017 6:11 PM

ప్రతీ ఇంటికి గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు.

జైపూర్ (ఆదిలాబాద్ జిల్లా) : ప్రతీ ఇంటికి గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ మండలంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ఆయన దీపం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నియోజకవర్గానికి 5 వేల గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు గ్యాస్ స్టవ్‌లు పంపిణీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement