అతని కోసం ఆమె.. ఆమె కోసం అతను! | lover committed suicide | Sakshi
Sakshi News home page

అతని కోసం ఆమె.. ఆమె కోసం అతను!

Jun 11 2017 11:00 AM | Updated on Sep 5 2017 1:22 PM

అతని కోసం ఆమె.. ఆమె కోసం అతను!

అతని కోసం ఆమె.. ఆమె కోసం అతను!

ఇద్దరిదీ ఒకటే సామాజికవర్గం కావడంతో..పెళ్లికి ఒప్పుకుంటారని భావించారు.

  • ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ప్రాణాలు విడిచిన వైనం
  • ప్రేమ త్యాగాన్ని కోరుకుంటోంది. కానీ జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్లా గ్రామంలో ప్రాణాలను కోరింది. పొరుమల్ల గ్రామానికి చెందిన కుంట రాజశేఖర్, పక్క గ్రామానికి చెందిన యువతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకటే సామాజికవర్గం కావడంతో...పెళ్లికి ఒప్పుకుంటారని భావించారు. కానీ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆస్తి లేదని దూరం పెట్టారు. దీంతో పరువుగా ఫీలైన రాజశేఖర్‌ ....డబ్బు సంపాదన కోసం గల్ఫ్‌ వెళ్లాడు. ఈ క్రమంలో యువతిపై తల్లిదండ్రులు పెళ్లి ఒత్తిడి తెచ్చారు. తాము చూపించిన అబ్బాయిని చేసుకోవాలని కోరారు.

    దీంతో వలచిన ప్రియుడ్ని మరవలేక....తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోలేక...ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.  ప్రియురాలు లేదని తెలిసిన రాజశేఖర్ 2 నెలల కిందట.. గల్ఫ్‌లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతని మృతదేహాం శనివారం స్వగ్రామానికి చేరడంతో.. బాధిత కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.

     

Advertisement
 
Advertisement
Advertisement