పంచాయతీ ఆఫీసులో ప్రేమ వివాహం | Love marriage in Panchayat office | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఆఫీసులో ప్రేమ వివాహం

Oct 29 2015 2:27 PM | Updated on Sep 3 2017 11:41 AM

గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రేమ వివాహం జరిగింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా నార్మెట్ట మండలం అంక్షాపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

నార్మెట్ట (వరంగల్) : గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రేమ వివాహం జరిగింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా నార్మెట్ట మండలం అంక్షాపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంతోష్(24), రమ్య(20)లు గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించకపోవడంతో.. గ్రామ పెద్దలను ఆశ్రయించారు. దీంతో గ్రామ పెద్దలు సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రేమ జంటకు బుధవారం వివాహం జరిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement