గుప్త నిధుల కోసం తవ్వకాలు! | Latent treasures for excavations | Sakshi
Sakshi News home page

గుప్త నిధుల కోసం తవ్వకాలు!

Sep 9 2015 11:22 PM | Updated on Sep 3 2017 9:04 AM

గుప్త నిధుల కోసం తవ్వకాలు!

గుప్త నిధుల కోసం తవ్వకాలు!

గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు...

పుల్‌కల్: గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. మరో వైపు తాము వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మిచుకునేందుకే తవ్వకాలు జరుపుతున్నామని చెబుతున్నా.. కాదు గుప్త నిధులకోసమే తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.  మండలంలోని శివ్వంపేట గ్రామంలో బండ బోయిని నర్సింలు ఇంటి సమీపంలోని స్థలంలో  50 నుంచి 60  ఫీట్ల లోతులో ఐదు వారాలుగా గుంత తీస్తున్నారు.

రాత్రి పూట తవ్వకాలు జరుపుతుండటంతో ఆ ప్రాంతంలోని వారు ఆందోళనకు గురవుతున్నారు. బాత్ రూం నిర్మాణం కోసమైతే పగలు తవ్వకాలు నిర్వహిస్తారు. అయినా తొమ్మిది ఫీట్ల కంటే ఎక్కువ లోతు తీసే పరిస్థితి ఉండదు. కాని ఏకంగా 50 ఫీట్లకు పైగా తవ్వకాలు నిర్వహించడంతో అనుమానాలకు దారి తీస్తోంది. అది ఎవ్వరికీ అనుమానం రాకుండా చుట్టూ దడి నిర్మించి తవ్వకాలు జరుపుతున్నారు. ఇప్పటికీ సుమారుగా 50 ఫీట్లకు పైగా తీయడం వల్ల గుంతల్లో నీరు ఊరుతుంది. అయినా తవ్వకాలు కొనసాగిస్తునే ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement