బాబు గైడెన్స్తోనే గొడవ చేస్తున్నారు: సురేఖ | Konda surekha takes on TTDP MLAs | Sakshi
Sakshi News home page

బాబు గైడెన్స్తోనే గొడవ చేస్తున్నారు: సురేఖ

Nov 7 2014 2:21 PM | Updated on Aug 11 2018 6:44 PM

బాబు గైడెన్స్తోనే గొడవ చేస్తున్నారు: సురేఖ - Sakshi

బాబు గైడెన్స్తోనే గొడవ చేస్తున్నారు: సురేఖ

తెలంగాణ అసెంబ్లీలో టీటీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారాల శైలిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ శుక్రవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో టీటీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారాల శైలిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ శుక్రవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. టీటీడీపీ ఎమ్మెల్యేలు పక్క ప్రణాళికతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి గైడెన్స్తో గొడవ చేస్తోందని ఆరోపించారు. గత టీడీపీ పాలన హయాంలో రైతుల ఆత్మహత్యల విషయంలో తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని ప్రశ్నోత్తరాలు అడ్డుకుంటున్నారని ఆమె విమర్శించారు.

సభలో ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడం సమంజసం కాదని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. కేంద్రం, పక్క రాష్ట్రంలో ఉన్న బీజేపీ, టీడీపీలు అక్కడి సమస్యలపై ఎందుకు నోరెత్తడం లేదని ఆయా పార్టీల నేతలను కొండా సురేఖ ప్రశ్నించారు. అలాగే తెలంగాణ విద్యుత్ సమస్యలను కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదో వెల్లడించాలని ఆయా పార్టీల నేతలను డిమాండ్ చేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement