ముస్లిం రిజర్వేషన్ల పెంపుపై ఉద్యమిస్తాం | k laxman criticises cm kcr on reservations | Sakshi
Sakshi News home page

ముస్లిం రిజర్వేషన్ల పెంపుపై ఉద్యమిస్తాం

Apr 13 2017 1:56 AM | Updated on Aug 14 2018 11:02 AM

ముస్లిం రిజర్వేషన్ల పెంపుపై ఉద్యమిస్తాం - Sakshi

ముస్లిం రిజర్వేషన్ల పెంపుపై ఉద్యమిస్తాం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ కమిషన్ నివేదికను ఆమోదించడాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ ఖండించింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌
అసెంబ్లీలో వ్యతిరేకిస్తాం


సాక్షి, హైదరాబాద్‌: ముస్లిం రిజర్వేషన్లను పెంచాలని రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం పై అసెంబ్లీలో, బయటా దీర్ఘకాలిక ఉద్యమా నికి సిద్ధమవుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఓటుబ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటానికి దిగనున్నట్లు వెల్లడిం చారు. ఒకటి, రెండు రోజుల్లో పార్టీ సమావే శాన్ని నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటామన్నారు.

ఎలాంటి శాస్త్రీ యపరమైన సమాచారం, అధ్యయనం లేకుం డా ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని 16న అసెంబ్లీలో తమ పార్టీ పూర్తి గా వ్యతిరేకిస్తుందన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్లను పెంచాల నే నిర్ణయం ద్వారా ప్రభుత్వం చారిత్రక తప్పిదానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. ఎలాంటి చట్టబద్ధత లేని సుధీర్‌ కమిటీ నివేదికను ఆధారంగా తీసుకుని ముస్లింల స్థితిగతులపై బీసీ కమిషన్‌ తప్పుల తడకగా సర్వే చేసి నివేదిక ఇవ్వడం సరికాదన్నారు.   

ప్రజలు ప్రతిఘటించాలి: కిషన్‌రెడ్డి
భూమిని, ఆకాశాన్ని ఏకం చేసైనా మత పరమైన రిజర్వేషన్లను అడ్డుకుంటామని బీజే ఎల్పీనేత కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ముస్లింలకు బీసీల కోటాలో రిజర్వేషన్లు అమ లు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరే కంగా బీజేపీ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభి స్తుందన్నారు. మతమార్పిళ్లకు ఊతమిచ్చే ఈ రిజర్వేషన్లను ప్రజలు ప్రతిఘటించాలని కోరారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును లెక్కచేయకుండా రాజ్యాంగ విరుద్ధంగా, అం బేడ్కర్‌ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం సరికాద న్నారు. ముస్లింలకు బీసీల కోటాలో రిజర్వేష న్లు ఇవ్వడం బీసీలను వంచించడమే అవు తుందని పేర్కొన్నారు. మతపరమైన రిజర్వే షన్లపై పునరాలోచించాలని, లేనిపక్షంలో బీసీల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కో వాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement