ఇల్లు కూలి భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు | House collapse in Mahabubnagar district due to heavy rains | Sakshi
Sakshi News home page

ఇల్లు కూలి భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు

Sep 12 2014 11:30 AM | Updated on Oct 8 2018 5:04 PM

మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని వీపనగండ్ల మండలం కొప్పునూరులో మట్టితో నిర్మించిన ఇల్లు కూలి పోయింది. దాంతో ఇంట్లో నిద్రిస్తున్న భార్యభర్తలపై మట్టి పెళ్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో భార్త మృతి చెందాడు. భార్య తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి తీవ్రగాయాలపాలైన ఆమెను  వైద్య చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వకి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement