‘గిన్నిస్‌ కిక్స్‌’లో తాండూరువాసి | Highest Taekwondo Kick Guinness Record | Sakshi
Sakshi News home page

‘గిన్నిస్‌ కిక్స్‌’లో తాండూరువాసి

Dec 18 2017 11:24 AM | Updated on Dec 18 2017 11:24 AM

Highest Taekwondo Kick Guinness Record - Sakshi

గంట వ్యవధిలో అత్యధిక తైక్వాండో కిక్స్‌తో గిన్నిస్‌ రికార్డు సృష్టించిన జట్టు సభ్యుల్లో వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన రవికుమార్‌ ఉన్నారు.

సాక్షి, తాండూరు టౌన్‌: గంట వ్యవధిలో అత్యధిక తైక్వాండో కిక్స్‌తో గిన్నిస్‌ రికార్డు సృష్టించిన జట్టు సభ్యుల్లో వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన రవికుమార్‌ ఉన్నారు. గత ఆగస్టు 12 న హైదరాబాద్‌లో నిర్వహించిన తైక్వాండో కిక్స్‌ గిన్నిస్‌ బుక్‌ అచీవ్‌మెంట్‌లో.. ఒకే గంటలో 58 వేల కిక్స్‌తో ఉన్న రికార్డును వీరు తిరగరాశారు. తైక్వాండో మాస్టర్‌ బొబ్బిలి ఆధ్వర్యాన నిర్వహించిన ఈవెంట్‌లో 89,402 కిక్స్‌తో రికార్డు సవరించారు. జట్టులో పాల్గొన్న రవికుమార్‌ గిన్నిస్‌ రికార్డు ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఈవెంట్‌లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement