జూడాల సమ్మెపై విచారణ రేపటికి వాయిదా | high court adjourns hearing on junior doctors strick | Sakshi
Sakshi News home page

జూడాల సమ్మెపై విచారణ రేపటికి వాయిదా

Oct 29 2014 1:13 PM | Updated on Aug 31 2018 8:26 PM

జూనియర్ డాక్టర్ల సమ్మెపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సమ్మె విరమిస్తేనే కేసు విచారిస్తామని న్యాయస్థానం మరోసారి జూడాలకు స్పష్టం చేసింది.

హైదరాబాద్ : జూనియర్ డాక్టర్ల సమ్మెపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.  సమ్మె విరమిస్తేనే కేసు విచారిస్తామని న్యాయస్థానం మరోసారి జూడాలకు స్పష్టం చేసింది. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని,  జూనియర్ డాక్టర్ల వాదనలతో తాము ఏకీభవించటం లేదని హైకోర్టు అభిప్రాయపడింది.. జూనియర్ డాక్టర్లు ఇంకా పరిణితి చెందాల్సి ఉందని న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది.  కాగా సమ్మె కొనసాగించేందుకే జూనియర్ డాక్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఇదే విషయాన్ని జూడాల తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement