వారసత్వ ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వాలి | Heritage should be given employment in the resolution | Sakshi
Sakshi News home page

వారసత్వ ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వాలి

May 19 2016 3:18 AM | Updated on Sep 2 2018 4:23 PM

వారసత్వ ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వాలి - Sakshi

వారసత్వ ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వాలి

సింగరేణి యామాజన్యం, తెలంగాణ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని వారసత్వ....

జైపూర్ : సింగరేణి యామాజన్యం, తెలంగాణ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని వారసత్వ ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వాలని హెచ్‌ఎంఎస్ యూనియన్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కె.పులయ్య తెలిపారు. మండలంలోని ఇందారం1ఏ గనిపై బుధవారం గేట్‌మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వారసత్వ ఉద్యోగాలు సాధిస్తామని హామీ ఇచ్చిన టీబీజీకేఎస్ గుర్తింపు సంఘం మళ్లీ ఎన్నికల ముందు కార్మికులను మోసం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు.

కార్మిక హక్కులను సాధించాల్సిన సంఘాలు ఉన్న హక్కులను సైతం కాపాడడంతో విఫలమైందన్నారు. వారసత్వ ఉద్యోగాల సాధన కోసం 26వ తేదీన అన్ని జీఎం కార్యాలయాల వద్ద దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ నాయకులు పి.రమేశ్, కొమురయ్య, నర్సయ్య, మల్లేశ్, శ్రీనివాస్, పోషం, బానయ్య, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement