హెడ్కానిస్టేబుల్ ఇంట్లో ఐదేళ్ల చిన్నారి మృతదేహం | Five years girl deadbody found at Malkapur | Sakshi
Sakshi News home page

హెడ్కానిస్టేబుల్ ఇంట్లో ఐదేళ్ల చిన్నారి మృతదేహం

Jan 29 2015 9:11 PM | Updated on Apr 4 2019 5:20 PM

కొండాపూర్ మండలం మల్కాపూర్లో గురువారం ఓ దారుణం వెలుగుచూసింది.

మెదక్: జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్లో గురువారం ఓ దారుణం వెలుగుచూసింది. జాకీర్ హుస్సేన్ అనే హెడ్కానిస్టేబుల్ ఇంట్లో ఐదేళ్ల చిన్నారి మృతదేహం బయటపడింది. బాలిక శరీరంపై గాయాలు ఉన్నట్టు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహన్ని పరిశీలించారు.

బాలిక విషయమై జాకీర్ కుటుంబాన్ని పోలీసులు ఆరాతీశారు. మియాపూర్ పోలీసు స్టేషన్లో జాకీర్ హుస్సేన్ హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అయితే బాలిక మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలిక మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. కాగా,   ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement