మెదక్‌లో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయండి   | Establish Medical College at Medak | Sakshi
Sakshi News home page

మెదక్‌లో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయండి  

Jun 1 2018 9:28 AM | Updated on Oct 16 2018 3:15 PM

Establish Medical College at Medak - Sakshi

శశిధర్‌రెడ్డి

మెదక్‌జోన్‌: నూతనంగా ఏర్పాటు అయిన జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోని జిల్లా కేంద్రంలో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలని  సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి గురువారం బహిరంగ లేఖ రాశారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక  సీఎం పూర్తిగా సిద్దిపేట జిల్లాపైనే దృష్టిపెట్టి మెదక్‌ జిల్లాను పూర్తిగా విస్మరించినట్లు చెప్పారు. మెడికల్‌ కళాశాలతో పాటు,  ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలను సైతం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా రామాయంపేటలో ప్రభుత్వ డిగ్రీకళాశాల, హవేళిఘణాపూర్, నిజాంపేట మండల కేంద్రాల్లో  ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని కోరారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement