డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి హాంకాంగ్ పురస్కారం | Dr. nagesvarreddi Hong Kong Award | Sakshi
Sakshi News home page

డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి హాంకాంగ్ పురస్కారం

Apr 7 2015 3:07 AM | Updated on Sep 2 2018 3:21 PM

డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి హాంకాంగ్ పురస్కారం - Sakshi

డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి హాంకాంగ్ పురస్కారం

ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి హాంకాంగ్ అత్యున్నత పురస్కారం లభిం చింది.

సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి హాంకాంగ్ అత్యున్నత పురస్కారం లభిం చింది. ఎండోస్కోపీ వైద్యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవడంపాటు చౌక ధరకే అందించినందుకుగానూ ఆయనకు హాంకాంగ్ గ్యాస్ట్రోఎంటరాలజీ సొసైటీ పురస్కారాన్ని అందించింది. హాంకాంగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హాంకాంగ్ గ్యాస్ట్రోఎంటరాలజీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ లావో వాయ్ చుంగ్ ఈ పురస్కారాన్ని నాగేశ్వర్‌రెడ్డికి అందించారు. ఇప్పటివరకూ ఈ అవార్డును ప్రపంచవ్యాప్తంగా 12 మంది వైద్యులు అందుకున్నారు. ఈ మేరకు ఆస్పత్రి యాజమాన్యం సోమవారం ప్రకటన విడుదల చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement