బీఎస్‌ఎన్‌ఎల్‌ మెగా మేళా | Bsnl Mela in Hyderabad | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ మెగా మేళా

Mar 4 2018 1:29 AM | Updated on Mar 4 2018 1:29 AM

Bsnl Mela in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వినియోగదారుల సౌకర్యార్థం సోమవారం నుంచి మెగా మేళా నిర్వహిస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది. ఐదు రోజుల పాటు జరిగే మేళాలో కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్లు/రిటైల్‌ అవుట్‌లెట్స్‌/రోడ్‌షోల్లో ఉచితంగా 3జీ సిమ్‌లు పొందవచ్చని పేర్కొంది. కొత్త కనెక్షన్‌ తీసుకునే వినియోగదారులకు 351 ఎంబీ ఉచిత డేటాను అందించనుంది. మేళాలో ల్యాండ్‌లైన్, బ్రాడ్‌ బ్యాండ్, ఎఫ్‌టీటీహెచ్‌ కనెక్షన్లను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మరిన్ని వివరాలకు 1503 లేదా 1800 1801 503లో సంప్రదించాలని కోరింది.

Advertisement
 
Advertisement
Advertisement