స్వైన్‌ఫ్లూ కేసులు 61 | 61 cases filed Swine flu cases in Ranga reddy district | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూ కేసులు 61

Jan 24 2015 6:48 AM | Updated on Mar 28 2018 11:11 AM

స్వైన్‌ఫ్లూ కేసులు 61 - Sakshi

స్వైన్‌ఫ్లూ కేసులు 61

స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య మరింత పెరిగింది. శుక్రవారం నాటికి 61 మంది స్వైన్‌ఫ్లూ భారిన పడినట్లు అధికారులు నిర్ధారించారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య మరింత పెరిగింది. శుక్రవారం నాటికి 61 మంది స్వైన్‌ఫ్లూ భారిన పడినట్లు అధికారులు నిర్ధారించారు. వీరికి వివిధ స్థాయిల్లో చికిత్స అందిస్తున్నప్పటికీ.. ఇప్పటికే నలుగురు మృతి చెందారు. వ్యాధి నివారణ చర్యలకు ఉపక్రమించిన జిల్లా యంత్రాంగం.. ప్రధాన ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచింది. 2,450 ఒసెల్టామీవిర్ 75ఎంజీ, 52 ఒసెల్టామీవిర్ ఎంఎల్‌లను క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రులకు పంపిణీ చేశారు. 90వేల వాల్‌పోస్టర్లు, కరపత్రాలతో స్వైన్‌ఫ్లూపై విస్తృతంగా చైతన్యం కల్పిస్తున్నట్లు జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement