బుల్లితెర నటుడు ఆకస్మిక మృతి | television actor Chika Suresh No More | Sakshi
Sakshi News home page

బుల్లితెర నటుడు ఆకస్మిక మృతి

Feb 12 2018 11:30 AM | Updated on Feb 12 2018 11:30 AM

television actor Chika Suresh No More - Sakshi

బనశంకరి :  కన్నడ బుల్లితెర నటుడు డైరెక్టర్‌ చిక్కసురేశ్‌ (52) అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి పదిరోజుల క్రితం చిక్కసురేశ్‌ గోవా వెళ్లారు. అక్కడ చిక్కసురేశ్‌ అనారోగ్యం బారిన పడటంతో కుటుంబ సభ్యులు బెంగళూరు  తరలిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. మృతుడికి భార్య వీణా, ఇద్దరు కుమారులు ఉన్నారు. పార్దీవ దేహాన్ని హొసకెరెహళ్లిలోని ఆయన నివాసానికి తరలించారు. చిక్కసురేశ్‌కు ఇటీవల గుండెకు శస్త్రచికిత్స జరిగింది. పలువురు టీవీ కళాకారులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement