అమ్మ ఆరోగ్యంపై కరుణ, స్టాలిన్‌ ఏమన్నారంటే.. | Stalin, Karunanidhi wish Amma a speedy recovery | Sakshi
Sakshi News home page

అమ్మ ఆరోగ్యంపై కరుణ, స్టాలిన్‌ ఏమన్నారంటే..

Dec 5 2016 1:38 PM | Updated on Sep 4 2017 9:59 PM

అమ్మ ఆరోగ్యంపై కరుణ, స్టాలిన్‌ ఏమన్నారంటే..

అమ్మ ఆరోగ్యంపై కరుణ, స్టాలిన్‌ ఏమన్నారంటే..

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని డీఎంకే చీఫ్‌ కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్‌ ఆకాంక్షించారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని డీఎంకే చీఫ్‌ కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్‌ ఆకాంక్షించారు. తమిళనాడు రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్థిగా ఉన్న కరుణానిధి.. జయ పూర్తిగా కోలుకోవాలని కోరుతూ ట్వీట్‌ చేశారు. జయలలిత కోలుకోవడానికి మెరుగైన చికిత్స అందివ్వాలని, ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ప్రతిపక్ష నేత స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు.

ఆదివారం జయలలితకు గుండె సంబంధిత సమస్య రావడంతో ఆమె ఆరోగ్యం విషమించింది. ఈ రోజు ఉదయం ఆమెకు సర్జరీ చేశారు. అయినా పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్‌ విడుదల చేశారు. జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు ట్వీట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement