నదిగళ్ ననైవదిల్లైకు ప్రశంసలు | Scientist Mayilsamy Annadhurai Praises Director | Sakshi
Sakshi News home page

నదిగళ్ ననైవదిల్లైకు ప్రశంసలు

Apr 1 2015 1:37 AM | Updated on Sep 2 2017 11:38 PM

నదిగళ్ ననైవదిల్లైకు ప్రశంసలు

నదిగళ్ ననైవదిల్లైకు ప్రశంసలు

నదిగళ్ ననైవదిల్లై చిత్రం సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. నాంజిల్ పీసీ అన్భళగన్

నదిగళ్ ననైవదిల్లై చిత్రం సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. నాంజిల్ పీసీ అన్భళగన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. ప్రణవ్, మోనిక, రిషే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. కాగా చిత్రాన్ని సినీ ప్రముఖులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. సీనియర్ దర్శకుడు ఎస్పీ ముత్తురామన్, గాయకుడు ఏసుదాస్ తదితర ప్రముఖులు నదిగళ్ ననైవదిల్లై చిత్రం చాలా బాగుందంటూ ప్రశంశల వర్షం కురిపించారు. చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, పాటలు, సంగీతం అభినందించతగ్గవిగా ఉన్నాయని ఏసుదాస్ వ్యాఖ్యానించారు. ఎస్పీ ముత్తురామన్ మాట్లాడుతూ నదిగళ్ ననైవదిళ్లై మంచి కథా బలం వున్న చిత్రం అని ప్రశంసించారు. ఈ తరం యువత ప్రేమను చక్కగా చెప్పారన్నారు. చిత్రంలో మదురై ముత్తు హాస్యం పండిందన్నారు. పలువురు ప్రముఖులు మంచి చిత్రం అంటూ నదిగళ్ ననైవదిళ్లై చిత్ర యూనిట్‌ను అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement