ఇంటిపేరు మార్చుకోను | Rani Mukerji not keen to change surname to Chopra | Sakshi
Sakshi News home page

ఇంటిపేరు మార్చుకోను

Jun 25 2014 10:28 PM | Updated on Sep 2 2017 9:23 AM

ఇంటిపేరు మార్చుకోను

ఇంటిపేరు మార్చుకోను

ఇంటి పేరు మార్చుకోవడానికి బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ఎంతమాత్రం ఇష్టపడడం లేదు. నిర్మాత ఆదిత్య చోప్రాను ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహమాడిన ఈ వగలాడి రాణీ ముఖర్జీగానే

ఇంటి పేరు మార్చుకోవడానికి బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ఎంతమాత్రం ఇష్టపడడం లేదు. నిర్మాత ఆదిత్య చోప్రాను ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహమాడిన ఈ వగలాడి రాణీ ముఖర్జీగానే చలామణీ కావాలని అభిలషిస్తోంది. ఇటలీలో అత్యంత సాదాసీదాగా వీరి వివాహం జరిగింది. ఐశ్వర్యరాయ్, కరీనాకపూర్‌లు తమ తమ భర్తల ఇంటి పేర్లను సొంతం చేసుకున్నప్పటికీ అదే బాటలో నడిచేందుకు రాణి ఆసక్తి కనబరచడం లేదు. ‘నా పేరంటే నాకు ఎంతో ఇష్టం. నేను దానినే కొనసాగిస్తా. రాణీ ముఖర్జీగానే నేను నటించిన సినిమాలన్నింటిలోనూ ప్రేక్షకులకు పరిచయం. ఆ పేరుతోనే నన్ను గుర్తిస్తారు. ఇక వ్యక్తిగతంగా నా పిల్లలను బడిలో చేర్చే సమయంలో మాత్రం ఇంటిపేరు మారుతుంది.
 
 అయితే నా అభిమానులందరికీ రాణీ ముఖర్జీనే’ అని తన మనసులో మాట బయటపెట్టింది. నగరంలో మంగళవారం తన తాజా సినిమా  ‘మర్దాని’ట్రయలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఈ వయ్యారిభామ పెళ్లి ఇటలీలోనే ఎందుకు చేసుకున్నారని అడగ్గా ఇందులో తన ప్రమేయం ఏమీ లేదంది. ఆదిత్య కోరిక మేరకే ఈ వివాహం అక్కడ జరిగిందని తెలిపింది. ఆదిత్యకు మొహమాటం ఎక్కువని, కనీసం మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడడని తెలిపింది. నటులనందరినీ బిచ్చగాళ్లతో పోల్చింది. పాత్రల ఎంపికలో తమకు ఎటువంటి చాయిస్ ఉండదని, ఇచ్చిన పాత్రను పోషించడమే తమ కర్తవ్యమంది. మహిళా ప్రధాన పాత్రలో భాగస్వామి కావాలని తన కోరికని చెప్పింది.
 

Advertisement
 
Advertisement
Advertisement