
మోదీ కోసం అర్ధనగ్నంగా పోజిచ్చి.. ప్రత్యర్థి పార్టీలోకి
కొత్త విషయం ఏంటంటే.. మేఘన ఇప్పుడు రాజకీయాల్లో వస్తోంది.
నటి, మోడల్ మేఘనా పటేల్ గుర్తుందా? 2014 లోక్సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీకి మద్దతుగా అర్ధనగ్నంగా ఫొటోలకు పోజిచ్చి సంచలనం సృష్టించింది. ఈ అమ్మడు బీజేపీ సింబల్ కమలాలపై పడుకుని, వాటినే శరీరంపై కప్పుకుని, ఓ చేత్తో నరేంద్ర మోదీ ఫొటో పట్టుకుని, అర్ధనగ్నంగా ఫొటో దిగింది. అప్పట్లో దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
మోదీకి మద్దతుగా ఈ ఫొటో దిగానని మేఘన చెప్పగా, బీజేపీ మాత్రం పార్టీ, మోదీ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్రలో ఆమె భాగమైందని విమర్శించింది. కొత్త విషయం ఏంటంటే.. మేఘన ఇప్పుడు రాజకీయాల్లో వస్తోంది. అయితే ఆమె చేరేది బీజేపీలో కాదు. మహారాష్ట్రలో బీజేపీకి ప్రత్యర్థి పార్టీ అయిన ఎన్సీపీ ద్వారా పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టనుంది.
మేఘనా పటేల్ ఎన్సీపీలో చేరబోతున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ ధ్రువీకరించారు. ఈ వారంలో వడోదరలో జరిగే కార్యక్రమంలో ఆమె పార్టీలో చేరుతారని చెప్పారు. మేఘనాకు చాలామంది అభిమానులున్నారని, ఆమె చేరిక వల్ల పార్టీ మరింత బలపడుతుందని చెప్పారు.