'సోమిరెడ్డికి దమ్ముంటే సవాల్ను స్వీకరించాలి' | Kakani goverdhan reddy slams Somireddy chandramohan reddy | Sakshi
Sakshi News home page

'సోమిరెడ్డికి దమ్ముంటే సవాల్ను స్వీకరించాలి'

Oct 25 2016 11:42 AM | Updated on Oct 30 2018 6:08 PM

మంత్రి నారాయణను పదవి నుంచి తొలగించేందుకు ఎమ్మెల్సీ సోమిరెడ్డి కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డి ఆరోపించారు.

నెల్లూరు: మంత్రి నారాయణను పదవి నుంచి తొలగించేందుకు టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. నిత్యం మంత్రి నారాయణకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయాలని విపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలపై సోమిరెడ్డి ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు.

సోమిరెడ్డి అవినీతి అక్రమాలపై నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సోమిరెడ్డికి దమ్ముంటే సవాల్ను స్వీకరించాలని కాకాని గోవర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement