మరికొంత కాలం ఆసుపత్రిలోనే జయ | Jayalalithaa requires longer stay in hospital, Apollo Hospitals says | Sakshi
Sakshi News home page

మరికొంత కాలం ఆసుపత్రిలోనే జయ

Oct 7 2016 11:20 AM | Updated on Sep 4 2017 4:32 PM

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది.

చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. అయితే ఆమె పూర్తిగా కోలుకునేందుకు మరి కొంత కాలం  ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు శుక్రవారం వెల్లడించారు. గత పదిహేను రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయ ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వర్గాలు గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

లండన్ నుంచి వచ్చిన వైద్యులతోపాటు ఎయిమ్స్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందం జయకు చికిత్స అందిస్తున్న విషయం విదితమే. జయలలిత ఆరోగ్య పరిస్థితిని వారు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement