పెళ్లికిప్పుడు తొందరేంలేదు | Bipasha Basu is in no rush to get married | Sakshi
Sakshi News home page

పెళ్లికిప్పుడు తొందరేంలేదు

Sep 11 2014 10:44 PM | Updated on Apr 3 2019 6:23 PM

పెళ్లికిప్పుడు తొందరేంలేదు - Sakshi

పెళ్లికిప్పుడు తొందరేంలేదు

బెంగాలీ బ్యూటీ ఇదివరకటి రెండు సినిమాలు ఆత్మ, హమ్‌షకల్స్ బోల్తాపడ్డా.. తాజాగా విడుదలైన క్రియేచర్ 3డి సినిమా బాగానే ఆడుతోంది. ఆత్మ పరాజయం ఎంతగానో బాధపెట్టిందని చెప్పింది.

బెంగాలీ బ్యూటీ ఇదివరకటి రెండు సినిమాలు ఆత్మ, హమ్‌షకల్స్ బోల్తాపడ్డా.. తాజాగా విడుదలైన క్రియేచర్ 3డి సినిమా బాగానే ఆడుతోంది. ఆత్మ పరాజయం ఎంతగానో బాధపెట్టిందని చెప్పింది. అందులో తల్లిగా కనిపించడాన్ని ప్రేక్షకులు అంగీ కరించలేదని వివరించింది. సరైన ప్రచారం లేకపోవడం వల్ల కూడా ఈ సినిమా వారికి చేరలేదని చెప్పింది. అయితే ఈ బ్యూటీ హమ్‌షకల్స్ ప్రచారానికి కూడా దూరంగా ఉంది. ఆ సినిమాలో తన పాత్ర నిడివి తక్కువగా ఉండడంతో వెళ్లలేదు.  ‘హమ్‌షకల్స్ సిని మాను అంగీకరించడం తప్పే. దాని కథేంటో ముందు నాకు తెలియదు. నా పాత్రేంటో అదెలా మలుపు తిరుతుతుందో కూడా తెలియదు.
 
 కాబట్టి ఆ సినిమా ప్రచారానికి నేను ఎందుకు వెళ్లాలి ?’ అని ప్రశ్నించింది. 2001లో అజ్‌నబీ సినిమాతో బాలీవుడ్‌లోకి వచ్చిన 35 ఏళ్ల బిపాసా తదనంతరం జిస్మ్, రాజ్, కార్పొరేట్, అపహరణ్, ధూమ్ 2, లమ్హా, ఆక్రోశ్ వంటి సినిమాలు చేసింది. బాలీవుడ్‌లోకి కొత్తతరం రావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయా.. అన్న ప్రశ్నకు బదులుగా సినీరంగంలో తనకంటూ ఒక స్థానం ఉన్నందున భయపడాల్సిందేమీ లేదంది. తానెంతో శ్రమించి ఈ స్థాయి చేరుకున్నానని, బిపాషా మాదిరిగా వేరే ఎవరూ ఉండలేరని స్పష్టం చేసింది. ఏదో పేరు, డబ్బు కోసం కాకుండా మనసుకు సంతృప్తినిచ్చే పాత్రలు చేయడమే తనకిష్టమని చెప్పింది.
 
 ఇక తాజా బిపాసా బసు విక్రమ్ భట్ తాజా సినిమాలోనూ నటిస్తోంది. టీవీ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ఇందులో హీరో. ఇదిలా ఉంట.. ప్రియుడు హర్మన్ బవేజాతో నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తల గురించి ప్రస్తావించినప్పుడు బిప్స్ నవ్వేసింది. పెళ్లికిప్పుడు తొందరేంలేదని, కెరీర్‌పై దృష్టిపెడుతున్నానని చెప్పింది. ‘పెళ్లికి ఇంకా గడువుంది. కాస్త మెల్లగానే చేసుకుంటాను. చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి’ అని ఈమె పీటీఐ ఇంటర్వ్యూలో వివరించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement