బాలీవుడ్ నటితో యువరాజ్ పెళ్లి | Yuvraj Singh to marry Hazel Keech | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ నటితో యువరాజ్ పెళ్లి

Sep 28 2016 10:59 AM | Updated on Sep 4 2017 3:24 PM

బాలీవుడ్ నటితో యువరాజ్ పెళ్లి

బాలీవుడ్ నటితో యువరాజ్ పెళ్లి

టీమిండియా డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ త్వరలో బాలీవుడ్ నటి హజెల్ కీచ్ను వివాహం చేసుకోబోతున్నాడు.

న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ త్వరలో బాలీవుడ్ నటి హజెల్ కీచ్ను వివాహం చేసుకోబోతున్నాడు. నవంబర్ 30న వీరిద్దరి పెళ్లి జరగనున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. డిసెంబర్ 5, 7 తేదీల మధ్య రిసెప్షన్ జరగనుంది.

యువరాజ్, హజెల్ కీచ్ చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నారు. గతేడాది నవంబర్లో బాలిలో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. యువరాజ్ ఇటీవల దులీప్ ట్రోఫీలో ఇండియా రెడ్ జట్టుకు నాయకత్వం వహించాడు.  ప్రస్తుతానికి క్రికెట్కు సంబంధించిన షెడ్యూల్ లేదు. బ్రిటన్కు చెందిన హజెల్ పలు టీవీ కార్యక్రమాలు, సినిమాల్లో నటించింది. దక్షిణాది సినిమాల్లో కూడా ఆమె కనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement