భారత్‌కు తొలి విజయం | With the US women's hockey | Sakshi
Sakshi News home page

భారత్‌కు తొలి విజయం

Jul 22 2016 12:43 AM | Updated on Apr 4 2019 5:04 PM

భారత్‌కు తొలి విజయం - Sakshi

భారత్‌కు తొలి విజయం

నాలుగు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాజయం నుంచి భారత మహిళల హాకీ జట్టు త్వరగానే కోలుకుంది.

అమెరికాతో మహిళల హాకీ

న్యూఢిల్లీ: నాలుగు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాజయం నుంచి భారత మహిళల హాకీ జట్టు త్వరగానే కోలుకుంది. అమెరికాతో జరిగిన తమ రెండో మ్యాచ్‌లో 2-1 తేడాతో నెగ్గింది. నేడు (శుక్రవారం) కెనడాతో భారత జట్టు తలపడుతుంది. తొలి క్వార్టర్‌లో హోరాహోరీ ప్రదర్శన ఎదురుకావడంతో ఇరు జట్ల నుంచి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.

అయితే 19వ నిమిషంలో అమెరికా తొలి గోల్‌ను సాధించింది. ద్వితీయార్ధంలో విజృంభించిన భారత్‌కు 45వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ లభించగా ప్రీతి దూబే గోల్ చేసింది. చివరి క్వార్టర్‌లోనూ అమెరికాపై ఒత్తిడి పెంచడంతో 55వ నిమిషంలో లిలిమా మింజ్ చేసిన గోల్‌తో  విజయం ఖాయమైంది.

Advertisement
 
Advertisement
Advertisement