బంతి తగిలి కుప్పకూలిన క్రికెటర్ | Vidarbha all-rounder Aditya Sarwate survives head injury scare | Sakshi
Sakshi News home page

బంతి తగిలి కుప్పకూలిన క్రికెటర్

Nov 11 2017 12:31 PM | Updated on Nov 11 2017 12:31 PM

Vidarbha all-rounder Aditya Sarwate survives head injury scare - Sakshi

కళ్యాణి (వెస్ట్ బెంగాల్): విదర్భ-బెంగాల్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రూప్-డి మ్యాచ్ లో భాగంగా ఇక్కడ బెంగాల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్ లో  బెంగాల్ తో జరుగుతున్న మ్యాచ్ లో విదర్భ ఆల్ రౌండర్ ఆదిత్య సర్వాతే తలకు బలంగా బంతికి తగలడంతో క్రీజ్ లో కుప్పకూలిపోయాడు. శుక్రవారం మూడో రోజు ఆటలో భాగంగా బెంగాల్ బౌలర్ ఇషాన్ పోరెల్ సంధించిన బౌన్సర్ ఒకటి ఆదిత్యా సర్వాతే తలక బలగా తాకింది. బంతిని పుల్ చేసే క్రమంలో అది కాస్తా మిస్సయ్యి హెల్మెట్  కు కుడివైపున తగిలింది. దాంతో విలవిల్లాడిన ఆదిత్యా క్రీజ్ లోనే కూలబడిపోయాడు.

ఆపై వెంటనే బెంగాల్ జట్టు సభ్యుల సాయంతో గ్రౌండ్ సిబ్బంది అతన్ని మైదానంలోకి తరలించారు. ఆ క్రమంలోనే ఆదిత్యకు సకాలంలో వైద్యం అందించడంతో అతను తేరుకున్నట్లు విదర్బ జట్టు అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement