ముర్రేకు పురస్కారం | Tennis star Andy Murray wins SPOTY, Adidas tweet: 'Not bad for a man with no personality | Sakshi
Sakshi News home page

ముర్రేకు పురస్కారం

Dec 17 2013 4:05 AM | Updated on Sep 2 2017 1:41 AM

ముర్రేకు పురస్కారం

ముర్రేకు పురస్కారం

77 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది బ్రిటన్ తరఫున ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఆండీ ముర్రేకు ‘బీబీసీ’ వార్షిక ఉత్తమ క్రీడాకారుడు పురస్కారం లభించింది.

లండన్: 77 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది బ్రిటన్ తరఫున ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఆండీ ముర్రేకు ‘బీబీసీ’ వార్షిక ఉత్తమ క్రీడాకారుడు పురస్కారం లభించింది. ప్రస్తుతం మియామిలో శిక్షణ తీసుకుంటున్న ముర్రేకు మహిళల టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా ఈ అవార్డును అందజేసింది. ఈ పురస్కారం రేసులో అథ్లెట్ మో ఫరా... ‘టూర్ డి ఫ్రాన్స్’ విజేత క్రిస్ ఫ్రూమ్... యూఎస్ ఓపెన్ గోల్ఫ్ చాంపియన్ జస్టిన్ రోస్ నిలిచినప్పటికీ ముర్రే ఘనతకే ఎక్కువ మంది మొగ్గు చూపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement