ఉత్సెయ హ్యాట్రిక్ వృథా | South Africa underwhelming over Zimbabwe | Sakshi
Sakshi News home page

ఉత్సెయ హ్యాట్రిక్ వృథా

Aug 31 2014 1:51 AM | Updated on Sep 2 2017 12:38 PM

ఉత్సెయ హ్యాట్రిక్ వృథా

ఉత్సెయ హ్యాట్రిక్ వృథా

జింబాబ్వే స్పిన్నర్ ఉత్సెయ (5/36) ఆ దేశ క్రికెట్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా రికార్డు సాధించినా... దక్షిణాఫ్రికా చేతిలో జట్టు పరాజయాన్ని మాత్రం ఆపలేకపోయాడు.

దక్షిణాఫ్రికా చేతిలో జింబాబ్వే ఓటమి
హరారే: జింబాబ్వే స్పిన్నర్ ఉత్సెయ (5/36) ఆ దేశ క్రికెట్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా రికార్డు సాధించినా... దక్షిణాఫ్రికా చేతిలో జట్టు పరాజయాన్ని మాత్రం ఆపలేకపోయాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్ జట్టు 61 పరుగులతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. ఆమ్లా (66), డి కాక్ (76) రాణించారు. నయుంబు 3, చతారా 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 38.3 ఓవర్లలో 170 పరుగులకే పరిమితమైంది. సీన్ విలియమ్స్ (46) టాప్ స్కోరర్. స్టెయిన్ మూడు, మెక్‌లారెన్ రెండు వికెట్లు తీశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement